Movie Updates : జనవరి 17న 'ఎమర్జెన్సీ రిలీజ్'

బాలీవుడ్ స్టార్, మండి ఎంపీ కంగనా రనౌత్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ, మూవీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది కంగనా. 197577 మధ్య ఎమర్జెన్సీ పరిస్థితుల కథాంశంతో మూవీ తెరకెక్కిం ది. మూవీని కంగానా స్వయంగా తెరకెక్కించింది. కాగా ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ పలు వివదాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. తాజా అప్డేట్స్ ప్రకారం ఎమర్జెన్సీ మూవీ వచ్చే ఏడాది జనవరి 17న ప్రే క్షకుల ముందుకు రాబోతోంది. మూవీ టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిం చింది. ఈమేరకు కంగనా రనౌత్ ఎ క్స్ వేదికగా స్వయంగా పోస్ట్ చేశారు. 'భారత దేశంలో శక్తిమంతమైన మహిళ చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు వచ్చే ఏడాది జనవరి 17న మీ ముందుకు రాబోతున్నాయి' అంటూ రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com