Akhanda : ఆ ఊరంతా 'అఖండ' నామస్మరణే...!

Akhanda : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం థియేటర్‌లో రికార్డులు తిరగరాసింది. అఘోరగా బాలయ్య నటన, బోయపాటి టేకింగ్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. రూ. 200కోట్లను కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. 24 గంటల్లో 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది.
ఈ రికార్డు ఇండియాలో మరే సినిమాకి లేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదిలావుండగా ఈ సినిమాని ఓ ఊరంతా కలిసి చూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనంనేనివారి పాలెంలో 'అఖండ' స్పెషల్ షో వేశారు. ఊరిలోని ఖాళీ ప్రదేశంలో పెద్ద తెరను, సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసి, ఈ సినిమా ప్రదర్శించారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ్రామాల్లో ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఇలాగే తెరలను కట్టి సినిమాలను ప్రదర్శించేవారనీ ఆనాటి రోజులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com