Kamakshi Bhaskarla : తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నా: కామాక్షి భాస్కర్ల

తాను చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే సమయంలో తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నానని హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వంటకాలు ట్రై చేస్తానని చెప్పారు. ‘చైనాలో ఒకప్పుడు గ్రీనరీ ఉండేది కాదు. తినడానికి కూరగాయలు కూడా దొరికేవి కాదు. అందుకే కనిపించిన జీవుల్ని చంపి తినడం వారికి అలవాటైంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాలతో కామాక్షి ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
కామాక్షి భాస్కర్ల .. 'పొలిమేర' సినిమా నుంచి ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. విరూపాక్ష, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పొలిమేర 2 తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మొదటి నుంచి కూడా బాగా చదువుకుని ఆమె డాక్టర్ అయ్యారు. అయితే ఈ లోగా సినిమాలపై పెంచుకుంటూ వచ్చిన ప్రేమ ఆమెను పూర్తిస్థాయిలో అటువైపు మళ్లించింది. ప్రస్తుతం ఆమె ఇటు వెబ్ సిరీస్ లతోను .. అటు సినిమాలతోను బిజీగా ఉన్నారు. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com