Shiva Karthikeyan : సినిమాలు మానేద్దామనుకున్నా: శివ కార్తికేయన్

Shiva Karthikeyan : సినిమాలు మానేద్దామనుకున్నా: శివ కార్తికేయన్
X

తాను ఒకప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్నట్లు తమిళ హీరో శివ కార్తికేయన్ వెల్లడించారు. ‘ఏమీలేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు. అజిత్, విక్రమ్ లాంటి వారూ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారు’ అంటూ తన భార్య మోటివేట్ చేయడంతో ఆగిపోయానని తెలిపారు. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. యాంకర్ స్థాయి నుంచి యాక్టర్‌గా ఎదిగిన నన్ను చాలా మంది అవమానించారు. నా విజయమే వారికి సమాధానం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా జాతీయ అవార్డు విజేత, దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం తమిళ్ యాక్టర్ శివ కార్తికేయన్ 25వ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం విలన్ గా స్టార్ యాక్టర్ 'జయం రవిని' పరిశీలించారు. దీనికి ఆయన ఓకే కూడా చెప్పేశాడు. ఇటీవల ‘అమరన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు శివ కార్తికేయన్. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. అయితే ఇది ఉన్ని ముకుందన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రూ. 300 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద రాణించింది. దీంతో శివ కార్తికేయన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Tags

Next Story