Bhagyashree Borse : ఒక్క హిట్టు పడ్డా దూసుకెళ్లడం పక్కా

నటన, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తున్న మరాఠీ భాష భాగ్యశ్రీ బోర్సే కు ఒక్క హిట్టు పడ్డా ఇక నాన్ స్టాప్ గా దూసుకెళ్లడం పక్కా అంటున్నారు టాలీవుడ్ పండితులు. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది ఈ పుణె నగరపు అందగత్తె. 2023లో యారియాన్ -1 అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేష న్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది. శంకర్ ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్స్ కి అదేంటో బాగా కలిసి వస్తుంది. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా కూడా భాగ్యానికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడు కింగ్ డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా, కాంతా సినిమాలు చేస్తుంది. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ పడ్డా అమ్మడిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఇది చాలదు అన్నట్టుగా మరికొన్ని సినిమాలు వచ్చి యాడ్ అవుతున్నాయి. భాగ్య శ్రీ ఖాతాలో లేటెస్ట్ గా అక్కినేని అఖిల్ సినిమా లెనిన్ నూ భాగ్యశ్రీ హీరోయిన్ అని తెలుస్తోంది. శ్రీలీల చేయాల్సిన ఆ సినిమా కాస్త ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ అవ్వట్లేద ని ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ కాగా ఆ ఛాన్స్ భాగ్య శ్రీ కొట్టేసింది. కింగ్ డం సినిమా నుంచి వచ్చిన సాంగ్ తో యూత్ ఆడియన్స్ కి దగ్గరైంది భాగ్య శ్రీ. చూస్తుంటే అమ్మడు టాలీవుడ్ లో కొన్నాళ్లు తన హవా కొనసాగించేలా ఉందనిపిస్తుంది. ఇక రిలీజ్ ల విషయానికి వస్తే భాగ్య శ్రీ నటించిన కింగ్ డమ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఆంధ్రా కింగ్ తాలూకా కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఈ రెండింటిలో ఏ ఒక్క హిట్టు పడ్డా ఈ అమ్మడు నాన్ స్టాప్ గా దూసుకెళ్లడం పక్కా..!
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com