Biopic: చంద్రబాబు, వైఎస్ జీవితాలపై వెబ్ సిరీస్..

Biopic: చంద్రబాబు, వైఎస్ జీవితాలపై వెబ్ సిరీస్..
Biopic: సినీ రంగమంతా ఒకలాగా ఆలోచిస్తే దర్శకుడు దేవ్ కట్టా మాత్రం ఇంకొకలాగా ఆలోచిస్తాడు. చెప్పాలనుకుంటుంది చెప్పేస్తాడు.

Biopic: సినీ రంగమంతా ఒకలాగా ఆలోచిస్తే దర్శకుడు దేవ్ కట్టా మాత్రం ఇంకొకలాగా ఆలోచిస్తాడు. కాంట్రరవర్సీ అవుతుందని తెలిసినా.. ఏ మాత్రం వెనకాడకుండా తాను చెప్పాలనుకుంటుంది ముక్కుసూటిగా చెప్పేస్తాడు. అందుకే ఆయన సినిమాలు కూడా అంత రా గా ఉంటాయి. పొలిటికల్ కథలను తెరకెక్కించడంలో దేవ్ కట్టా దిట్ట. అందుకే మరోసారి అలాంటి ఒక పొలిటికల్ డ్రామాతో మరోసారి ప్రేక్షకుల ముందుగా రానున్నాడు ఈ దర్శకుడు.

అదే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో రిపబ్లిక్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న దేవ్ కట్టా తన తరువాతి ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

పొలిటికల్ కథలను ఎక్కువగా ఇష్టపడే దేవ్ కట్టాకు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల జీవితాలపై వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాలి అనుకుంటున్నాడట. అంతే కాదు దానికి తగినట్టుగా కథలు కూడా సిద్ధం చేసుకున్నాడు. కాలేజీ రోజుల నుండి వీరిద్దరు ఎలా ఉండేవారు అనే అంశంతో సిరీస్‌లు మొదలవుతాయి. కథ సిద్ధంగా ఉన్నా వాటిలో నటించే వారు కూడా ముఖ్యం కాబట్టి దానికోసం సమయం పడుతుందన్నారు.

వీరిపై సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ తీస్తే అదొక సెలబ్రేషన్‌లాగా వుండాలని, అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని దేవా కట్టా తెలిపారు. పైగా తాను తీయాలనుకుంటున్న ఈ వెబ్ సిరీస్ గురించి ఇండస్ట్రీలోని చాలామంది పెద్ద హీరోలకు తెలుసని వెల్లడించారు. ఏ మాత్రం అప్డేట్ లేకుండానే చంద్రబాబు, వైఎస్‌పై వెబ్ సిరీస్‌ తెరకెక్కిస్తున్నానంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు దేవ్ కట్టా.

Tags

Read MoreRead Less
Next Story