RRR Movie: ఒకవైపు థియేటర్లలో సందడి.. మరోవైపు విషాదం.. సినిమా చూస్తుండగానే అభిమాని మృతి..

RRR Movie: ప్రస్తుతం దేశమంతటా 'ఆర్ఆర్ఆర్' మూవీ మ్యానియా నడుస్తోంది. తెల్లవారుజాము నుండే థియేటర్ల దగ్గర ఎన్‌టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అభిమానులు సందడి చేయడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. అయితే సినిమా చూస్తూనే హీరోల అభిమాని ఒకరు గుండెపోటుతో మరణించడం విషాదాన్ని నింపింది.
నేడు థియేటర్ల వద్ద అభిమానుల సందడి చూస్తుంటే.. ఓ పెద్ద పండుగలాగా అనిపించక మానదు. ముఖ్యంగా ఫస్ట్ డే థియేటర్లు ఎక్కువగా హీరోల అభిమానులతో నిండిపోయాయి. కొన్ని చోట్ల థియేటర్లలలో ఈలలు, గోలలతో సినిమాలోని డైలాగులు కూడా వినిపించడం కష్టంగా మారిందని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఇదే సందడి మాత్రం ఓ విషాదం కూడా చోటుచేసుకుంది.
అనంతపురానికి చెందిన ఓబులేసు 'ఆర్ఆర్ఆర్' బెనిఫిట్ షోకు వెళ్లాడు. ఆ సందడి మధ్యలో సినిమా చూస్తుండగా.. హఠాత్తుగా తనకు గుండెపోటు వచ్చింది. ఇది గమనించిన తన స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఓబులేసు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సినిమా చూస్తుండగా తను ఉన్నట్టుండి కుప్పకూలిపోయినట్లు స్నేహితులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com