KGF-SALAAR: కేజీఎఫ్‌కి సలార్ రానున్నాడా..?

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా టీజర్ జులై 6న ఉదయం 5.12 నిమిషాలకు విడుదలై యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో అభిమానుల్ని ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం 'సలార్: ది సీజ్ ఫైర్' టీజర్‌ను ఇప్పుడు విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్ థ్రిల్లర్‌గా రానున్న సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ తీసిన హోంబలే సంస్థే సలార్‌ని కూడా నిర్మిస్తుండటంతో కేజీఎఫ్ కి మించి ఉండనుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
రెండు భాగాలుగా వచ్చిన కేజీఎఫ్ సినిమా, అందులోని హీరో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఇపుడు ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్లుగానే ఇప్పుడు కూడా డైనోసార్‌తో పోలుస్తూ 46 సెకండ్ల టీజర్‌లో అవే ఎలివేషన్లు ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే కేజీఎఫ్‌లోని రాఖీ భాయ్, సలార్‌లో ప్రభాస్ ఎదురవనున్నారా. ఈ రెండు సినిమాలకు ఏమైనా కనెక్షన్ ఉందా అంటే, అవును అనే అంటున్నారు కొందరు ఫ్యాన్స్. అదే జరిగితే ఫ్యాన్స్‌కు ఇక పండగే. రెండు సినిమాలు కూడా అదే బ్లాక్ అండ్ వాతావరణంతో ఉన్నాయి అంటూ అభిమానులు గుర్తించిన పలు పోలికలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
1. కేజీఎఫ్ సినిమాలో క్లైమాక్స్‌లో హీరో బంగారంతో కూడిన ఓడతో మునిగి పోయిన ఉదయం దాదాపు ఆ సమయంలోనే సలార్ టీజర్‌ని కూడా విడుదల చేయడం.
2.రెండు సినిమాలకు ఉపయోగించిన సినిమాటోగ్రఫీ, కలరింగ్ అంతా రస్టిక్‌గా ఒకేలా ఉండటం.
3.కేజీఎఫ్ లో కనిపించిన C-516 ట్యాంకర్ ఈ టీజర్‌లో కూడా ఉందంటూ గుర్తించారు.
4. సలార్‌లో నటిస్తోన్న ఈశ్వరీ రావు కేజీఎఫ్‌లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది.
5. సలార్ సినిమా కూడా 2 పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందు రానుండటం.
ఈ అంశాల్ని పోలుస్తూ ఈ రెండు సినిమాలకు మధ్య కనెక్షన్ ఉండే అవకాశం ఉందంటూ వాదిస్తున్నారు.
కన్నడ రాకింగ్ స్టార్ యాష్ నటించిన కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చిత్రాలు భారీ హైప్ క్రియేట్ చేస్తూ దానికి తగ్గట్లుగానే అలరించడంతో ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అదే నిర్మాణ సంస్థ, అదే సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తీస్తుండటంతో ఈ సినిమాపై కేజీఎఫ్ కంటే ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సలార్ సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com