Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్.. మరీ ఇంత అభిమానమా..?

ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తర్వాత అతని ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఆ ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇంకే భాషలోని టాప్ హీరో లేనంత దూకుడుగా ఉన్నాడు డార్లింగ్. ప్రస్తుతం రాజా సాబ్ మూవీతో బిజీగా ఉన్నాడు. మరోవైపు హను రాఘవపూడితో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) చేస్తున్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డితో స్పిరిట్, సలార్ 2 ఉండబోతున్నాయి. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు అతని పాత సినిమాలను రీ రిలీజ్ చేయడంలో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారు ఫ్యాన్స్.
ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ఎవరైనా అతని కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూస్తారు. బట్ ఫ్యాన్స్ మాత్రం పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఒకటీ రెండు కాదు.. ఏకంగా 6 సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. వీటిలో అతని ఫస్ట్ మూవీ ఈశ్వర్ తో పాటు బ్లాక్ బస్టర్స్ అయిన ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, రెబల్, సలార్ సినిమాలున్నాయి. సలార్ అంటే నిన్నా మొన్నటిదే అనుకోవచ్చు. బట్ ఈశ్వర్ నుంచి రావడం అంటే కాస్త అతిశయోక్తే అయినా.. అభిమానానికి అవేం ఉండవు కదా. అసలే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ విపరీతంగా ఉంది. ఒక్కో సినిమా విడుదల చేస్తేనే మినిమం కలెక్షన్స్ రావడం లేదు. అలాంటిది ఇలా అన్నీ ఒకేసారి వదిలితే ఫ్యాన్స్ కు కూడా కన్ఫ్యూజనే కదా.. ఏం చూడాలా అని. అదీకాక ఒకేసారి ఇన్ని మూవీస్ చూడాలంటే బడ్జెట్ కూడా సహకరించాలి. ఏదేమైనా బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్సే ప్రభాస్ కు ఈ సిక్స్ మూవీస్ గిఫ్ట్ ఇస్తున్నారనుకోవచ్చు. మరి ఈ మూవీస్ లో దేనికి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com