Allu Arjun Birthday : అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి

Allu Arjun Birthday : అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి
X

పుష్ప స్టార్ అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి వందలాదిగా వచ్చిన అభిమానులు.. జై బన్నీ జై బన్నీ నినాదాలతో రోడ్లపై రచ్చ చేశారు. పుష్ప ఫ్లెక్సీలతో మెయిన్ రోడ్డులో ర్యాలీ తీస్తూ హంగామా చేశారు. బన్ని అభిమానులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అల్లు అర్జున్ అభిమానులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెదరగొట్టారు.

Tags

Next Story