Kannada Actor : నాన్నకు క్యాన్సర్ సర్జరీ సక్సెస్: శివరాజ్ కూతురు నివేదిత

Kannada Actor : నాన్నకు క్యాన్సర్ సర్జరీ సక్సెస్: శివరాజ్ కూతురు నివేదిత
X

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌కు USలో క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిన్న కుమార్తె నివేదిత ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘ఈ కష్టకాలంలో నాన్న చూపిన స్థైర్యం మాలో ధైర్యాన్ని నింపింది. అభిమానులు, ఫ్రెండ్స్ ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలు మాకెంతో బలాన్ని ఇచ్చాయి. వారికి మా ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తాం’ అని పోస్టు చేశారు. డిసెంబర్ 18న శివరాజ్‌కుమార్ తన భార్య గీతా శివరాజ్‌కుమార్‌తో కలిసి అమెరికా వెళ్లారు. అమెరికా వెళ్లే ముందు పలువురు ప్రముఖులు శివరాజ్‌కుమార్‌ను కలిశారు. శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు ఆయన అభిమానులు కూడా శివన్న ఆరోగ్యం కుదుటపడాలని పూజలు చేస్తున్నారు. చామరాజనగర్‌లోని శివన్న అభిమానులు తాజాగా దేవుడు పాదాల దగ్గర శివరాజ్ కుమార్ ఫోటోలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.

Tags

Next Story