Nayanthara : ఆ క్షణంలోనే అతని ప్రేమలో పడిపోయా : నయనతార

Nayanthara : ఆ క్షణంలోనే అతని ప్రేమలో పడిపోయా : నయనతార
X

సౌత్ స్టార్ బ్యూటీ నయనతారపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఒక డాక్యుమెంటరీ చేస్తున్న విషయం తెలిసిందే. "నయనతార: బీయాండ్‌ ది ఫెయిరీటేల్‌" అనే పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో నయన్ వ్యక్తిగత, సినీ జర్నీ, ప్రేమ, పెళ్లి గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. ఇందులో భాగంగానే థన్ భర్త విగ్నేష్ శివన్ తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు నయన్. "పాండిచ్చేరిలోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్‌ పెట్టారు. విజయ్‌ సేతుపతి మీద సీన్స్‌ షూట్‌ చేస్తున్నారు. నేను దూరంగా విఘ్నేష్‌ శివన్‌ను గమనిస్తున్న. మోముపై చెరగని చిరునవ్వు, సన్నివేశాన్ని వివరించే శైలి, దర్శకుడిగా అతని ప్రత్యేకమైన పనితీరు నన్ను ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే అతని ప్రేమలో పడిపోయా" అంటూ చెప్పుకొచ్చింది నయనతార. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story