Rajamouli Conditions : మహేష్ తో సినిమా.. జక్కన్న షూటింగ్ కండిషన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూ మినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. సినిమాకు సంబంధించిన విషయాలు ఎక్కడా లీకవ్వకుండా ఉండటానికి రాజమౌళి అండ్ టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు పని చేస్తున్న అందరితో రాజమౌళి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎవరైనా సినిమా నుంచి కంటెంట్ ను లీక్ చేస్తే దానికి వారు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. తరుచూ ట్రిప్ కు వెళ్లే అలావాటున్న మహేశ్ బాబు విదేశాలకు వెళ్లకుండా ఆయన పాస్ట్ పోర్టును జక్కన్నే తీసుకున్నట్టు టాక్ వచ్చింది. మిగిలిన సినిమాలు వేరు. రాజమౌళితో మ్యాటర్ వేరు. ఆయన సి నిమాలకు పని చేసేటప్పుడు లైఫ్ ఇంతకు ముందున్నట్టు ఉండదు. బయటకు వెళ్లాలన్నా, ఫ్యామిలీ ఈవెంట్ కు వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందే. మొన్న మహేశ్ నుంచి పాస్ పోర్టును తీసుకున్న రాజమౌళి, ఇప్పుడు ఫోన్ ను కూడా తీసేసుకున్నాడట.
ఈ సినిమాకు సంబంధించి లీకులేం కాకుండా జాగ్రత్త పడుతున్నా ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమను ఆస్కార్ లెవెల్ కు తీసుకెళ్లిన రాజమౌళి, ఈ సినిమాతో ఇంకెన్ని ఘనతలు సాధిస్తాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు. కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ గా రాజమౌళి తెరకె క్కిస్తున్నాడు. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com