Allu Arjun : ఫ్లవర్ కాదు ఫైర్ .. అస్సలు తగ్గేదేలే

Allu Arjun : ఫ్లవర్ కాదు ఫైర్ .. అస్సలు తగ్గేదేలే
X

హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జరిగిన సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఇవాళ బన్నీని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన సమయంలో 'ఫ్లవర్ నహీం, ఫైర్ హై' అనే ట్యాగ్న్తో కూడిన టీషర్ట్ ధరించాడు. ఈ డైలాగ్ పుష్ప 2 హిందీ వెర్షన్లో ఉంటుంది. నార్త్ చాలా పాపులర్ అయ్యింది. ఇక పోలీసులు వచ్చిన సమయంలో గ్రీన్ టీ తాగుతూ కూల్గా కనిపించాడు. స్టేషన్ కి వెళ్లేముందు తన సోదరుడు శిరీష్, భార్య అల్లు స్నేహ రెడ్డితో కొంతసేపు మాట్లాడాడు. తర్వాత పోలీసులతో మాట్లాడుతూ ఎక్కువమంది పోలీసులతో కాకుండా ఒకరో, ఇద్దరు వచ్చి ఉండాల్సిందని ఎక్కువమంది పోలీసులు రావడంతో తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నాడు. అనంతరం పోలీసులు ఎస్కార్ట్ వాహనంలోనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఈ క్రమంలో పోలీస్ వాహనంలో అల్లు అరవవింద్ కూడా వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ బన్నీ మాత్రం అందుకు నిరాకరించాడు. అలాగే ఈ సంఘటనతో వచ్చిన క్రెడిట్ గుడ్, బ్యాడ్ ఏదైనా తనకే దక్కాలని చెప్పాడు.

Tags

Next Story