Rashmika Mandanna : నా స్కూల్లోనే ఫస్ట్ లవ్..అసలు విషయం చెప్పిన రష్మిక

Rashmika Mandanna : నా స్కూల్లోనే ఫస్ట్ లవ్..అసలు విషయం చెప్పిన రష్మిక
X

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో దూ సుకుపోతుంది. బాలీవుడ్లో స్థిరపడాలనే ఆశయంతో పనిచేస్తూ.. ఇప్పుడిప్పుడే అక్కడ స్ట్రాంగ్ కెరీర్ ను బిల్డ్ చేసుకుం టుంది. కెరీర్ పరంగా ఇలా సంతోషం గానే సాగిపోతుంది. మరి వ్యక్తిగత జీవితంలో లవ్ ఏదైనా ఉందా? అంటే.. కెరీర్ ఆరంభంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. కానీ పీఠలెక్కే సమయంలో పెళ్లి రద్దు చేసుకుంది. ఇక ఆమె తొలి లవ్ ఎక్కడ ప్రారంభమైంది? అంటే స్కూల్లో అని తెలిపింది. మొదటి ప్రేమ లేఖ ఎక్కడ? అని అడిగితే అదీ స్కూల్లోనే అని సమాధానం ఇచ్చింది. ఇటీవల ఓ ప్రెస్మీట్ లో పాల్గొన్న ఆమె.. రక్షిత్ శెట్టి గురించి ఎక్కడైనా అడుగుతారేమోనాని ఊహించింది. కానీ అంత ఛాన్స్ ఎవరూ తీసుకోలేదు. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్లో ఓ యువ హీరోతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారం చాలాకా లంగా ఉంది. కానీ అది స్నేహంగానే భావిస్తు న్నాం తప్ప ప్రేమగా కాదంటూ పలుమా ర్లు వివరణ వచ్చింది. అయినా ఇద్దరు కలిసిన ఫోటోలు బయటకు రావడం మాత్రం ఆగలేదు.

Tags

Next Story