Balakrishna : ప్రభాస్, బాలయ్య మెగా హీరోలకు అదే డేట్ కావాలట

ఏ సినిమాకైనా సరైన రిలీజ్ డేట్ పడటం చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి రిలీజ్ డేట్ వల్ల మంచి సినిమాలకు కూడా కలెక్షన్స్ తగ్గే అవకాశాలుంటాయి. అలాగే యావరేజ్ మూవీకి పెరుగుతాయి కూడా. అందుకే ప్రస్తుతం ఓ డేట్ పై నలుగురు హీరోలు కన్నేశారు. నలుగురూ వచ్చే అవకాశం ఉంది. కానీ కలెక్షన్స్ తగ్గుతాయి. ఇంతకీ ఆ డేట్ ఏంటంటే.. సెప్టెంబర్ 25. ఇదే రోజు రిలీజ్ చేస్తాం అని ఆల్రెడీ బాలయ్య, సాయిదుర్గా తేజ్ ప్రకటించారు. లేటెస్ట్ ఆ డేట్ కే రావాలని ప్రయత్నిస్తున్నారు ప్రభాస్ రాజా సాబ్ మేకర్స్.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతోన్న అఖండ 2 తాండవం చిత్రాన్ని సెప్టెంబర్ 25 రిలీజ్ టార్గెట్ గానే షూటింగ్ చేస్తున్నారో. ఈ సారి దసరా అక్టోబర్ 2నే వచ్చింది. అందుకే పండగ శెలవులు బాగా కలిసొస్తాయనే ఈ డేట్ ను ప్రిఫర్ చేసుకున్నారు. అదే ఆలోచనతో సాయిదుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని అదే రోజు విడుదల చేస్తాం అని ప్రకటించారు. సాయితేజ్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో రూపొందతోన్న భారీ సినిమా ఇది. అందుకే వీళ్లకూ పండగ శెలవులు కావాలి.
ఇక మారుతి డైరెక్ట్ చేస్తోన్న ప్రభాస్ రాజా సాబ్ సమ్మర్ నుంచి వాయిదా పడింది. వీళ్లు కూడా ఇప్పుడు సెప్టెంబర్ 25నే రావాలనుకుంటున్నారు. ఆ మేరకే వర్క్ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. వీరు సరిపోరు అని ఇక రేస్ లో మేము సైతం అనేలా కనిపిస్తున్నారు ‘ఓ.జి’ మేకర్స్.
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజికి సంబంధించి అతను ఓ మూడు వారాలు టైమ్ ఇస్తే అంతా అయిపోతుందని చాలా రోజులుగా చెబుతున్నారు. ఫ్యాన్స్ కూడా హరిహర వీరమల్లు కంటే ఓజి కోసమే చూస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఎలాగైనా పవన్ తో ఆ డేట్స్ తీసుకుంటే వీళ్లు కూడా సెప్టెంబర్ 25నే రావొచ్చు అనే ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ నలుగురులో ఇద్దరైతే కన్ఫార్మ్. ప్రభాస్ వస్తే అది డైనోసార్ కాబట్టి ఇతర సినిమాలకు సమస్యే. బట్ బరిలో బాలయ్య, సాయితేజ్ మాత్రమే ఉంటే ఇద్దరూ బ్లాక్ బస్టర్స్ కొట్టొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com