టీవీలో బ్లాక్ బస్టర్ గదర్ 2...ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు

టీవీలో బ్లాక్ బస్టర్ గదర్ 2...ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు

2023లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన గదర్ 2ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తెలుగులో ప్రసారం కానుంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గదర్ 2, ఫిబ్రవరి 18 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ కానుంది.

అనిల్ శర్మ దర్శకత్వంలో 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించిన ఈ చిత్రం 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో తారా సింగ్ (సన్నీ డియోల్) ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కింది. జైలులో ఉన్న తన కుమారుడు చరణ్ జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) ను రక్షించడానికి పాకిస్థాన్ నుంచి తిరిగివచ్చిన తారా సింగ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ.

థియేట్రికల్ రిలీజ్ సక్సెస్ తర్వాత ఫిబ్రవరి 18న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది ‘గదర్ 2’. ప్రేక్షకులకు అదిరిపోయే యాక్షన్ వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది.

Tags

Read MoreRead Less
Next Story