Game Changer Bookings : గేమ్ ఛేంజర్ బుకింగ్స్ స్టార్ట్

మెగా హీరో రాంచరణ్, కియారా అద్వాని, అంజలి హీరో హీరోయిన్లుగా నటిం చబోతున్న గేమ్ చేంజర్ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాలో రాంచరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కించిన ఈ మూవీని జనవరి 10న థియేట్రికల్ గా రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో విడుదలకు రెండు మూడు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ మొదలు అవుతుంది. యూఎస్ లో రెండు మూడు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అవుతుంది. అయితే యూకేలోని ది లైట్ సినిమాస్లో అప్పుడే గేమ్ ఛేంజర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యింది. సరిగ్గా నెల రోజులు ఉండగానే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. యూకేలో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. వందల నుంచి వేలల్లో టికెట్లు బుక్ అవుతున్నాయి అంటూ డిస్ట్రి బ్యూటర్ పేర్కొన్నారు. యూఎస్తో పాటు గేమ్ ఛేంజర్ను యూకేలోను భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని యూనిట్ సభ్యులు చెబుతున్నా రు. సాధారణంగా యూకేలో ఇండియన్ సినిమాలు యూఎస్తో పోల్చితే తక్కువ వసూళ్లు చేస్తాయి. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం ఎక్కువ వసూళ్లు రాబట్టే విధంగా ప్రయత్నా లు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com