Game Changer : గేమ్ ఛేంజర్ ఎదురీత .. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు

మెగా హీరో రాంచరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సఫీస్ వద్ద అనుకున్న కలెక్షన్లు రాబట్టలేక పోయింది. ఈ సినిమాను రూ.220 కోట్లకు ప్రీరిలీజ్ చేసింది. బ్రేక్ ఈవెను కోసం మరో 222 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ 11 రోజుల వ్యవధిలో రూ. 101.74 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే మరో రూ.153.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ 11 రోజుల కలెక్షన్లను గమనిస్తే.. నైజాం 19.05 కోట్టు, సీడెడ్ 10.31 కోట్లు, ఉత్తరాం ధ్ర10.23 కోట్లు, ఈస్ట్ 6.20 కోట్లు, వెస్ట్ 4.06 కోట్లు, కృష్ణా5.23కోట్లు, గుంటూరు6.19 కోట్లు, నెల్లూరు 3.58 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఏపీ + తెలంగాణ కలుపుకొని మొత్తం 64.85 కోట్లు, కర్ణాటక 4.85 కోట్లు, తమిళనాడు 3.53 కోట్లు, కేరళ 0.26 కోట్లు, ఓవర్సీస్ 14.05 కోట్లు, నార్త్ 14.20 కోట్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 101.74 కోట్ల షేర్ వచ్చింది. రాంచరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం 'గేమ్ ఛేంజర్' అలాగే.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ప్రమోషన్స్ తో కలిపి మొత్తం రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com