OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా, అంజలి, సూర్య, జయరాం కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచుకున్న గేమ్ ఛేంజర్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. అయితే గేమ్ ఛేంజర్ ఓటీటీలో ఈ సినిమాను అదనపు నిడివితో రిలీజ్ చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ అమెజాన్ ప్రైమ్ వారికీ షాక్ ఇస్తూ థియేట్రికల్ వర్షన్ 2 గంటల 38 నిమిషాలు వర్షన్ ను మాత్రమే ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసింది. మరోవైపు రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబుసన డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాను శరవేగంగా చేస్తున్నాడు రామ్ చరణ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com