Game Changer : రేపే గేమ్ ఛేంజర్ టీజర్

Game Changer : రేపే గేమ్ ఛేంజర్ టీజర్
X

మెగా హీరో రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్ శంకర్ కాంబోలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్'. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీ. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. హీరోయిన్ కియారా అడ్వాణీకి సంబంధించి కొత్త లుక్ పోస్టర్ను వదిలారు. 'గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాయాజాలానికి, బ్యూటిఫుల్ కియారా అడ్వాణీ అందాల అనుభుతి పొందేందుకు ఒక్క రోజే ఉంది. గేమ్ ఛేంజర్ టీజర్ నవంబర్ 9న వస్తోంది. జనవరి 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది' అని మేకర్స్ ట్వీట్ చేశారు. పోస్టర్లో కియారా మోడ్రన్ ఔట్ ఫిట్లో కుర్రాళ్ల మతిపొగొట్టేలా ఉంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ రేపు లక్నోలో జరగనుంది. టీజర్కు మరో రోజు మాత్రమే మిగిలి ఉందని తెలియజేస్తూ.. చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story