Tollywood : గేమ్ ఛేంజర్@ 70 మిలియన్స్

మెగా హీరో రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబోలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన అవి క్షణంలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈమూవీ థియేటర్లలోకి వస్తుందా అని ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈమూవీ విడుదల కాబోతోందని నిర్మాత దిల్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొత్తం మూడు భాషల్లో దీనిని రూపొందించారు. అయితే ప్రస్తుతం ఈ టీజర్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఏ మూవీ టీజర్ కి రాని రెస్పాన్స్ గేమ్ ఛేంజర్ కి వచ్చింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే గేమ్ ఛేంజర్స్ సెన్సేషనల్ నెంబర్స్ ని చేరుకుంది. ఏకంగా 70 మిలియన్లకి పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. గేమ్ ఛేంజర్ టీజర్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుండటంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు అందుకు సంబంధించి ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com