Pan-India Film : లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్

Pan-India Film : లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 9న టీజర్ విడుదల కానుంది. అది కూడా లక్నోలో. ఇక్కడ విశేషం ఏంటంటే లక్నోలో ఇప్పటివరకు సినిమాలకు సంబంధించిన ఒక్క ఈవెంట్ కూడా జరుగలేదు. అలా లక్నోలో ఈవెంట్ జరుపుకుంటున్న మొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయనుంది గేమ్ ఛేంజర్ మూవీ. ఇక టీజర్ తో మొదలైన గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ విడుదల వరకు కంటిన్యూ అవుతాయట. ఈ సినిమా జనవరి 10న 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story