Game Changer : అలెర్ట్.. రేపే గేమ్ ఛేంజర్ ట్రైలర్

Game Changer : అలెర్ట్.. రేపే గేమ్ ఛేంజర్ ట్రైలర్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్ గా నటించారు. అలాగే ఈసినిమాలో హీరోయిన్ అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడి యోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయను న్నారు మేకర్స్. న్యూఇయర్ సందర్భంగా కొత్త అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. రేపు (జనవరి 2న) ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ప్రకటిచింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఇవాళ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

Tags

Next Story