Gamechanger : రిలీజ్ అప్పుడు ఖాయం చేశారా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ramcharan ), శంకర్ ( Shankar ) కాంబినేషన్ లోని పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ ( Gamechanger ). ఈ సినిమా ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. మరో 10 నుండి 15 రోజుల వర్క్ పెండింగ్‌లో ఉంది . టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించింది. భారతీయుడు 2 విడుదల అయిపోవడంతో.. ఇప్పుడు శంకర్ పూర్తిగా గేమ్ చేంజర్ సినిమాపైనే దృష్టి సారించాడు.
అసలు మేటర్ లోకి వస్తే .. గేమ్ ఛేంజర్ మేకర్స్ డిసెంబర్ విడుదలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా సమాచారం. అల్లు అర్జున్ పుష్ప 2, మంచు విష్ణు కన్నప్ప కూడా అదే నెలలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడ్డాయి. డిసెంబర్‌లో గేమ్ ఛేంజర్ వచ్చినట్లయితే, పుష్పకు, గేమ్ చేంజర్ కు మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా, అంటే.. విడుదల మూడవ లేదా నాల్గవ వారంలో జరిగేలా నిర్మాతలు ప్లాన్ చేశారు.
త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ బాణీలు సమకూరుస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com