Pushpa Ticket : గెట్ రెడీ బన్నీ ఫ్యాన్స్ .. పుష్ప టికెట్ 800

Pushpa Ticket : గెట్ రెడీ బన్నీ ఫ్యాన్స్ .. పుష్ప టికెట్ 800
X

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రూల్..! ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కిసిక అంటూ చిందులేసింది. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న

ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. బన్నీ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. వారికి క్యూరియాసిటీకి తగ్గట్టుగానే మేకర్స్ సినిమాను డిసెంబర్ 4 అర్ధరాత్రి నుంచే ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమా టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా బెన్ ఫిట్ షో టికెట్ ధర రూ.800 కు ఖరారు చేసింది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్ రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ రూ.20, మల్టీఫ్లెక్స్ రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విడుదలకు ముందు రికార్డుల మోత మోగిస్తున్న పుష్ప ది రూల్ సినిమా ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతలూగిం చేందుకు రెడీ అయ్యింది. సో గెట్ రెడీ బన్నీ ఫ్యాన్స్!

Tags

Next Story