Actor Kayadu Lohar : కాయాదు లోహర్ కు గోల్డెన్ చాన్స్

Actor Kayadu Lohar : కాయాదు లోహర్ కు గోల్డెన్ చాన్స్
X

కాయాదు లోహర్.. ప్రజంట్ యూత్ క్రష్. లేటెస్టుగా ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిన ఈబ్యూటీ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన 'డ్రాగన్' మూవీలో ఈ అమ్మడు నటించింది. ఇదే తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ' పేరుతో రిలీజ్ అయింది. ఇందులో లోహార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. డబ్బింగ్ మూవీతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పటికే తమిళ తంబీలు ఆమె అందానికి దాసోహం అంటుంటే, తెలుగు కుర్రకారు కూడా ఈలిస్టులో చేరిపోయారు. ఈబ్యూటీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, లుక్స్ కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఈముద్దుగుమ్మ ఫొటోలు, వీడియోలే దాంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి ఆమె మీదకు మళ్లింది. 'డ్రాగన్' సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తున్న నేపథ్యం లో పలు క్రేజీ ఆఫర్లు కాయాదు లోహర్ తలుపు తడుతున్నాయని తెలుస్తోంది. ఆల్రెడీ సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి ఆఫర్ వెళ్లినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపి స్తోంది. విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఫంకీ’ మూవీకి డ్రాగన్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా మరికొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయంట. ఏదిఏమైనప్పటికీ మొత్తం మీద దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తోందీ అస్సామీ భామ.

Tags

Next Story