Game Changer : గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్లో అకీరా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరానందన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాడా..? ఇంతకు నటించాడా.. సంగీత సహకారం అందించాడా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాంచరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి నేప థ్యంలో ఈ నెల 10న విడుదలవుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్-4కు రాంచరణ్ తేజ్ వచ్చి సందడి చేశాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అకీరా గురించి చర్చకు రాగా.. అతడు గేమ్ ఛేంజర్ కోసం పనిచేశాడని చెప్పారు. ఇంతకు తెరపై కనిపిస్తాడా..? తెరవెనుక నుంచి సహకారం అందించాడా..? అన్నది తెలియాల్సి ఉంది. అకీరాకు సంగీతమంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం సంగీత దర్శకు డు తమన్ టీమ్ లో పనిచేసినట్లు చెప్తున్నారు. ఏది ఏమైనా'గేమ్ ఛేంజర్'లో అకీరా పాత్ర ఏంటనేది తెలియాలంటే జనవరి పదో తారీఖు దాకా ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com