OG : పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో ఓజీకి టికెట్ ధరల పెంపుకు అనుమతి

OG : పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో ఓజీకి టికెట్ ధరల పెంపుకు అనుమతి
X

పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది.

విడుదల తేదీ, టికెట్‌ ధరల వివరాలు సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. ఈ షోకు టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించారు. రెగ్యులర్ షోలు సినిమా విడుదల రోజు అయిన సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఒక్కో టికెట్‌పై రూ.100 పెంచుకోవచ్చు. ఒక్కో టికెట్‌పై రూ.150 పెంచుకోవచ్చు.

ఈ నిర్ణయంతో చిత్ర యూనిట్‌తో పాటు, పవన్‌ కల్యాణ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story