Tollywood : యంగ్ డైరెక్టర్‌తో గోపిచంద్ మూవీ?

Tollywood : యంగ్ డైరెక్టర్‌తో గోపిచంద్ మూవీ?
X

‘విశ్వం’ తర్వాత గోపీచంద్ నటించే మూవీపై అప్‌డేట్ రాలేదు. తాజాగా, ఆయన ‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల డైరెక్టర్ ఓ కథ చెప్పగా అది గోపిచంద్‌కు నచ్చి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కథ విభిన్నమైందని, చిట్టూరి శ్రీనివాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సంకల్ప్ రెడ్డి కెరీర్‌లో సైతం ‘ఘాజీ’ మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదు. ఇక అప్పటి నుండి రెండేళ్లు ఖాళీగా ఉన్న సంకల్ప్.. గోపీచంద్ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట. అందుకోసం ఈ కథ నేషనల్ లెవల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఘాజీ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నారు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. ఇపుడు నేషనల్ అవార్డు డైరెక్టర్తో గోపీచంద్ సినిమా ఎలాంటి ప్రయోగాల మధ్య వస్తుందో చూడాలి మరి ఈ కాంబోలో వస్తున్న సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Tags

Next Story