Prabhas: బాధలోనూ అభిమానులను ఆప్యాయంగా..: ప్రభాస్ పెద్ద మనసుకి ఫ్యాన్స్ ఫిదా

Prabhas: తండ్రిలా ఆదరించిన పెదనాన్న కృష్ణంరాజు.. ప్రభాస్‌కి ఇక లేరు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలు ఆయన్ని కోలుకోనివ్వకుండా చేశాయి. ప్రేమ, ఆప్యాయతలకు పెద్ద పీట వేసే కృష్ణంరాజు కుటుంబం ఆయనకు అభిమానులను చేరువ చేసింది.
షూటింగ్ సమయంలో కృష్ణంరాజు యూనిట్ సభ్యులకు ఇంటిని భోజనం తెప్పించి పెట్టేవారట. ఆయన అంత్యక్రియలనాడు ప్రభాస్ కూడా అదే తరహాలో అంత బాధలోనూ అభిమానుల్ని ఆప్యాయంగా పలకరించారట. అందూ భోజనం చేసి వెళ్లండి అని ప్రభాస్ చెప్పిన మాటలను అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అభిమానులపై ప్రభాస్‌కి ఉండే ఆప్యాయతే వేరు. మా ప్రభాస్ అన్న దేవుడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ప్రభాస్‌కు అరుదైన ఆహ్వానం
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దిల్లీలో రావణ దహనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ని ఆహ్వానించేవరు. అయితే ఈ ఏడాది ఆ ఆహ్వానాన్ని మన హీరో ప్రభాస్ అందుకున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com