Hansika : మహారాణిలా హన్సిక.. ఫొటోలు వైరల్

Hansika : మహారాణిలా హన్సిక.. ఫొటోలు వైరల్
X

హిందీ సీరియల్స్ తో పాటు కోయి మిల్ గయా తదితర సినిమాల్లో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ హన్సికా మోత్వాని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి దేశముదురు సినిమాతో అల్లు అర్జున్ సరసన నటించిందీ భామ. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది. సరదా పాత్రల నుంచి సీరియస్ రోల్స్ వరకు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందీ అమ్మడు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నీలి రంగు చీరలో హొయలు పోతూ పోజులిచ్చిన ఫొటోలను పోస్ట్ చేసింది. హన్సిక రాజకుటుంబంలోంచి వచ్చిన మహారాణిలా కనిపిస్తోంది. ఎంబ్రాయిడరీ, మెరిసే ఫాబ్రిక్, ఆమె ఆత్మవిశ్వాసంతో కూడిన భంగిమ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ ఫొటోలను నటి త్రిష్ లైక్ చేయడం మరో విశేషం.

Tags

Next Story