Hansika : వావ్, సూపర్ క్యూట్.. ట్రెడిషన్ లుక్లో హన్సిక

Hansika : వావ్, సూపర్ క్యూట్.. ట్రెడిషన్ లుక్లో హన్సిక
X

దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచమయైన భామ హన్సిక మోత్వానీ. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. గ్లామరస్ రోల్స్ తోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అయితే వరుస సినిమాలతో కెరీర్ పీక్స్ ఉండగానే.. ఈ అమ్మడు మ్యారేజీ చేసుకుని కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ 'మహా'మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక గతేడాది ఆమె '105' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ కుర్రకారు మనసును కొల్లగొడుతోంది. తన అందంతో అందరినీ మంద్రముగ్ధుల ను చేస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. తాజాగా ఈబ్యూటీ ఇన్స్టా వేదికగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఒక్కసారి గా ట్రెడిషన్ లుక్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మను చూసిన అభిమానులను సంబరపడిపోతున్నారు. ఇందులో మల్లెపూలతో ఆరెంజ్ కలర్ లెహంగా వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్, సూపర్ క్యూట్ అని పొగడ్తలతో ముంచే స్తున్నారు. కాగా.. ఇటీవల హన్సికపై ఆమె సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ పెట్టిన గృహ హింస కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Tags

Next Story