Rashmika Mandanna : హ్యాపీ బర్త్ డే రష్మిక... నేషనల్ క్రష్ కి విషెస్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న 29 పడిలోకి ఎంట్రీ అయ్యింది. పుష్ప -2 సినిమాతో నేషనల్ క్రష్ గా ఫేమస్ అయిన ఈ అమ్మడు అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్ పెట్ లో ఏప్రిల్ 5, 1996లో జన్మించింది. కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ఎమ్మెస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. రష్మిక మొదట మోడలింగ్షో లలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ఇ చ్చాడు. ఇప్పుడు తెలుగు, హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన సికందర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. మరోవైపు చేతినిండా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంటోంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన చావా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెలో ఆనందం వెల్లివిరిస్తోంది. ఈ ఏడాది తన బర్త్ డే చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడిం చిందీ అమ్మడు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఓమన్ వేదికగా జరుపుకోనున్నట్టు తెలిపింది. ఫ్యామిలీ మెంబర్స్, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రష్మిక బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనుందని తెలిసింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో కుబేర, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com