Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు 14న సెకండ్ సాంగ్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లు గా నటిస్తున్న సినిమా హరిహరవీరమల్లు. ఈ సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఫిబ్రవరి 14న సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తార ని తెలుస్తోంది. ఈ సాంగ్ లో నిధి అగర్వాల్ కనిపించనున్నారని టాక్. పవర్ స్టార్, నిధితో కలిసి స్టెప్పులు వేస్తారని అంటున్నారు. వాలంటైన్స్ డే రోజున విడుదల చేసే ఈ సాంగ్ పై అభి మానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా నుంచి అల్రెడీ పచ్చిన పవన్ ట్రీట్ మాట వినాలి సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఇక ఇపుడు సినిమా రెండో సాంగ్ పై ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మాణ బా ధ్యతలు చూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com