Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు సెకండ్ సాంగ్ వైరల్

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు సెకండ్ సాంగ్ వైరల్
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరి హర వీరమల్లు. స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనేది ట్యాగ్ లైన్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన మాట వినాలి పాటకు మంచి ఆదరణ లభించింది. తాజాగా మరో గీతాన్ని విడుదల చేశారు. కొల్లగొట్టినాదిరో... రెండవ గీతంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ పాట సినిమా అంచనాలను మరింత పెంచింది. పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ఈ పాటలో అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తమ నృత్యాలతో అదనపు ఆకర్షణగా నిలిచారు. కీరవాణి స్వరపరిచిన ఈ గీతం బహుళ భాషల్లో విడుదలైంది. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సందీప్ కుమార్, అరుణ మేరి ఆలపించారు.

Tags

Next Story