Harihara Veeramallu : హరిహర వీరమల్లు విడుదల వాయిదా!

సుదీర్ఘకాలం పాటు సెట్స్ పైనే ఉన్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఐదేళ్ల కిందట మొదలైంది. ఏపీ రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాతకు ఇబ్బంది కలిగించవద్దన్న ఉద్దేశంతో బిజీగా ఉన్నప్పటికీ ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేందుకు ముందుకు ఆయన రావడంతో షూటింగ్ కాస్త ముగిసి విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 12న విడుదల చేయాలని నిర్ణయించిన చిత్ర బృందం, ఆ మేరకు ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడంతో మరోసారి సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. యుస్ లోని ప్రధాన సినిమా థియేటర్లు ఇప్పటికే షెడ్యూల్ చేసిన షోలను తొలగించాయి. కొత్త తేదీ ఖరారుపై ప్రస్తుతం మూవీటీమ్ కసరత్తులు చేస్తోంది. మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగే కథతో దీన్ని క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ తెరకెక్కించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com