Hari Hara Veera Mallu Song : హరిహర వీరమల్లు ... మొదటి పాట రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా సగ భాగాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తు న్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం హరిహర వీరమల్లు 1 ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తం గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇవాళ ఈ చిత్రంలోని మొదటి పాట మాట వినాలి సాంగ్ ను విడుదల చేసింది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పాటను పాడడం విశేషం. 'మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి..' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో వైరల్ అవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com