Hebah Patel : హెబ్బా హోయలు.. చీరలో తళుక్కు

హీరోయిన్ హెబ్బా పటేల్ రెడ్ కలర్ చీరలో తళు క్కుమంది. గ్లామరస్ చూపులతో మైమరిపించింది. ఈ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. వీటిని చూసిన అభిమానులు లైకులు, కామెంట్లతో ఆకట్టుకుంటున్నా రు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వస్తోందీ అమ్మడు. కెరీర్ లో ఎక్కువగా బోల్డ్ సినిమాల్లోనే నటించిందీ భామ. కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాల్లో అవ కాశాలు వచ్చాయి. హిట్లు కూడా పడ్డాయి. తన గ్లామరస్ నటన, లిప్ లాక్ లతో కు ర్రకారు మతి పోగొట్టిందీ భామ. ఇంత చేసినా ఆమెకు రావాల్సినంత స్టార్ స్టేటస్ మాత్రం రాకపోగా అదే ఆమెకు మైనస్ అయింది. ఎందుకంటే పాత్రకు మంచి స్కోప్ లేకున్నా చేయడం వల్ల ఆమెకు నటన పరంగా పెద్దగా మార్కులు పడలేదు. బోల్డ్ బ్యూటీ ముద్ర పడటంతో స్టార్ హీరోలు ఆమెను పెద్దగా పట్టించుకోలే దు. దాంతో అడపా దడపా వచ్చిన అవకాశాలతో నెట్టుకొస్తోంది హెబ్బా. ప్రస్తుతం ఓదెల - 2 సినిమాలో నటిస్తోం దీ అమ్మడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. ఈ తరుణంలో తన అందంతో రచ్చ చేస్తూ ప్రేక్షకులను థియేటర్ల వైపు లాక్కెళ్లేందుకు ట్రై చేస్తోందీ అమ్మడు. ఎర్ర చీర ధరించిన ఈ బ్యూటీ పైట కొంగు పక్కకు జరిపి మరీ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ అమ్మడు త్వరలోనే మరో మెయిన్ సినిమాలో నటించే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com