Chandini Chowdary : హెల్ప్ ప్లీజ్... చాందిని చౌదరి రిక్వెస్ట్!

'కలర్ ఫొటో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ చాందిని చౌదరి. తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంది. చాందిని చౌదరి తన సహజమైన నటనకు పేరుగాంచారు. ఆమె గ్లామరస్ పాత్రలతో పాటు, బలమైన కథా నేపథ్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు. సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ ఉండే ఈ చిన్నది అక్కడ కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఈ అమ్మడు ఇన్ స్టాలో పెట్టిన స్టేటస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అదేమిటంటే.. 3 డేస్ బేబీకి ఏబీ బ్లడ్ ఎమెర్జెన్సీ ఉంది అని అడ్రెస్ తో పాటు వాళ్ల ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసింది. అలాగే రక్తం ఇచ్చి మూడు రోజుల బాబును సేవ్ చేయండి.. అడ్వాన్స్ సాయం చేసే వారికి థ్యాంక్యూ అంటూ రాసుకొచ్చిందీ అమ్మడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మూడు రోజుల బిడ్డ అని అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఎవరైనా వెళ్లి రక్తం ఇచ్చారో లేదో మరి!
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com