Radhe Shyam OTT: ఓటీటీలోకి 'రాధే శ్యామ్'.. రిలీజ్ ఎప్పుడంటే..

Radhe Shyam OTT: ఓటీటీలోకి రాధే శ్యామ్.. రిలీజ్ ఎప్పుడంటే..
Radhe Shyam OTT: సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలయిన 4 వారాలలో ఓటీటీలో వచ్చేస్తుంది.

Radhe Shyam OTT: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన రాధే శ్యామ్ అన్ని వర్గాల ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే కొందరు సినిమాపై ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. తాజాగా ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలయిన 4 వారాలలో ఓటీటీలో వచ్చేస్తుంది. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది కాబట్టి 'రాధే శ్యామ్' ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు వేయడం మొదలుపెట్టేశారు. తాజాగా రాధే శ్యామ్ డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తంతో అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం.

అమెజాన్ ప్రైమ్ చేతికి ఓ మంచి సినిమా వచ్చి చాలాకాలమే అయ్యింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో పోటీ ఎక్కువగా పెరిగిపోవడంతో ప్రైమ్ ఈమధ్య కాస్త వెనకబడింది. అయితే రాధే శ్యామ్ విషయంలో మాత్రం అలా జరగకూడదని, ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ప్రైమ్ యాజమాన్యం భారీగానే ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది.

రాధే శ్యామ్‌ను ఉగాది సందర్భంగా ఓటీటీ ప్రేక్షకుల ముందుగా తీసుకురావాలనుకుంటోందట ప్రైమ్. మామూలుగా ఏప్రిల్ 11న రాధే శ్యామ్ ఓటీటీలో విడుదల అవ్వా్ల్సి ఉన్నా.. ఏప్రిల్ 2 ఉగాది ఉండడంతో ఆరోజు స్ట్రీమింగ్ ప్రారంభిస్తే.. ఓటీటీలో కూడా రాధే శ్యామ్ రికార్డులు బద్దలుకొడుతుందని అమెజాన్ ప్రైమ్ భావిస్తోందట.

Tags

Read MoreRead Less
Next Story