Shanmukh Jaswanth: బిగ్ బాస్ 5 తెలుగులో షణ్నూ రన్నర్‌గా మిగిలిపోవడానికి కారణాలు ఏంటి?

Shanmukh Jaswanth: ఏ ఆటలో అయినా ఎంతమంది చివరి వరకు కష్టపడి ఆడినా.. చివరికి విన్నర్‌గా నిలిచేది ఒక్కరే. బిగ్ బాస్‌లో కూడా అదే జరిగింది. 100 రోజులకు పైగా బయట ప్రపంచానికి సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఉండడానికి 19 మంది సిద్ధమయ్యారు. కానీ అందులో అందరినీ దాటుకుంటూ విజయం సన్నీనే వరించింది. తన తరువాతి స్థానంలో రన్నర్‌గా షన్నూ నిలిచాడు. టాప్ 5 వరకు చేరుకున్న షన్నూ రన్నర్‌గా మిగిలిపోవడానికి కారణాలు ఏంటి?
ఒక యూట్యూబర్ తన కెరీర్‌ను మొదలుపెట్టిన షన్నూ.. కవర్ సాంగ్స్, డబ్‌స్మాష్‌లాంటివి చేస్తూ ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ వల్లే తాను అంత ఫ్యాన్‌బేస్‌ను కూడా సంపాదించుకున్నాడు. ఎప్పుడూ యూట్యూబ్ ప్రపంచాన్ని దాటి బయటికి రాని షన్నూకు బిగ్ బాస్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. హౌస్‌లోకి వచ్చే సమయానికి సన్నీకంటే షన్నూకే ఫ్యాన్ బేస్ ఎక్కువ కానీ తాను విన్నర్‌గా అవ్వకపోవడానికి హౌస్‌లో తాను చేసిన చిన్న చిన్న పొరపాట్లే కారణమని తన ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒకే ఫీల్డ్ నుండి వచ్చినవారు కాదు. కానీ అందులో సిరి, షన్నూ ఇద్దరూ మాత్రం యూట్యూబర్లుగానే హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. వీరు కలిసి షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించారు. అందుకే హౌస్‌లోకి ఎంటర్ అయినప్పుడు వీరిద్దరు మిగతా వారితో పెద్దగా కలవకుండా ఉండేవారు. మెల్లగా వీరి ప్రవర్తన బిగ్ బాస్ ప్రేక్షకులను అసహనానికి గురిచేసిందని సమాచారం.
టాస్క్‌ల విషయంలో షన్నూ ఎప్పుడూ తన శక్తిని మించి ప్రయత్నించినా.. ఎంటర్‌టైన్మెంట్ విషయంలో మాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ప్రయత్నం తాను ఎప్పుడూ చేయలేదని ప్రేక్షకులు భావించారు. షన్నూ, సిరిల ప్రవర్తన, ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడంలో వెనకబడడం లాంటివే ముఖ్యంగా షన్నూను టైటిల్ విన్నర్ కాకుండా చేశాయని నెటిజన్లు అనుకుంటున్నారు. పైగా దీని వల్ల తనకు బయట నెగిటివిటీ కూడా పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com