నా స్నేహితుడు బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టాడు... నేను హ్యాపీ : ప్రభాస్

నా స్నేహితుడు బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టాడు... నేను హ్యాపీ : ప్రభాస్
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సీటీమార్... వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదలైంది.

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సీటీమార్... వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సక్సెస్ పైన పాన్ ఇండియా స్టార్ హీరో, గోపీచంద్ స్నేహితుడు ప్రభాస్ స్పందించాడు. 'సీటీమార్‌ సినిమాతో నా స్నేహితుడు బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయం నాకెంతో ఆనందంగా ఉంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఫలితం గురించి కంగారులేకుండా ఇలాంటి పెద్ద చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన టీమ్‌ మొత్తానికి నా అభినందనలు' అని ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిచగా, . శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిత్తూరి నిర్మించారు. భూమిక, రావు రమేశ్‌, తణికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story