Nandamuri Balakrishna : గుర్రం ఎక్కి హంగామా చేసిన బాలయ్య..!

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు. ప్రకాశంజిల్లా కారంచేడులో సోదరి దగ్గుబాటి పురంధరేశ్వరి నివాసంలో ఆయన సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా సంబరాలు జరుపుకున్న బాలయ్య.. తనదైన స్టైల్‌లో అలరించారు. గుర్రంపై సవారీ చేసిన బాలయ్య.. దానితో స్టెప్పులు వేయించారు. గుర్రం కూడా వాయిద్యాల మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్పులు మారుస్తూ ఆకట్టుకుంది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా గుర్రంపై సవారీ చేశారు. బాలయ్య అంత కాకపోయినా.. గుర్రంతో స్టెప్పులు వేయించారు. ఈ వేడుకల్లో నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు అంతా పాల్గొన్నారు.
ఎప్పుడూ నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను జరుపుకునే బాలకృష్ణ కుటుంబం.. ఈసారి మాత్రం ఆయన సోదరి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంట్లో పండుగ చేసుకున్నారు. ప్రతీసారి నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేవారు. చుట్టుపక్కల పల్లెల్లో సందడి చేసేవారు. వీటిని చూడటానికి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నారావారిపల్లెకు తరలివెళ్లేవారు. దీంతో అక్కడ ప్రతీ సంక్రాంతికి సందడి వాతావరణం నెలకొనేది. ఈసారి మాత్రం కారంచేడులో సంక్రాంతి జరుపుకున్న బాలయ్య కుటుంబం ఇక్కడా అదే జోష్‌తో సందడి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com