Prabhas : అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్ధికసాయం..!

Prabhas : అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్ధికసాయం..!
Prabhas : గుంటూరు జిల్లాకు చెందిన చల్లా పెదకోటి తన అభిమాన హీరో సినిమా రాధేశ్యామ్ రిలీజ్‌ సందర్భంగా థియేటర్ వద్ద బ్యానర్‌ కడుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు...గుంటూరు జిల్లాకు చెందిన చల్లా పెదకోటి తన అభిమాన హీరో సినిమా రాధేశ్యామ్ రిలీజ్‌ సందర్భంగా థియేటర్ వద్ద బ్యానర్‌ కడుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషయాన్ని మండల అభిమాన సంఘం నాయకుడు చల్లా అనిల్‌ ప్రభాస్ కి తెలియజేయడంతో వెంటనే రూ. 2 లక్షలు ఆర్థికసాయం అందజేశారు. పెదకోటి భార్య పిచ్చమ్మ, తల్లిదండ్రులకు చెక్కును అందజేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story