Ravi Teja Father : హీరో రవితేజ తండ్రి మరణం..

X
By - Manikanta |16 July 2025 11:15 AM IST
టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి రాజగోపాల్ రాజు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్ది కాలంగా వయస్సు రీత్యా సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన నిన్న రాత్రి కన్నుమూశారు.
విషయం తెలుసుకున్న రవితేజ సన్నిహితులు, ఇతర నటులు ఉదయాన్నే ఆయన ఇంటికి చేరుకుని రాజగోపాల్ రాజు కు నివాళులర్పిస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు రవితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు కాగా, వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com