Hero Surya : కంగువా నిర్మాతకు అండగా హీరో సూర్య

తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించారు. పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త అటెంప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మాత్రం ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి భారీ నష్టం వచ్చిందట. దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతకు అండగా నిలిచాడట హీరో సూర్య. తన తరువాతి సినిమాను కూడా అదే బ్యానర్ లో చేసేందుకు ఒప్పదం కుదుర్చుకున్నాడట. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com