Hero Surya : డైరెక్ట్ ఓటీటీలోకి హీరో సూర్య సినిమా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను గత కొన్నేళ్లుగా పరాజయాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన గ్యాప్ లేకుండా కష్ట పడుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తెలుగులో వెంకీ అట్లూరితో ఒక సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు అనే మూవీ చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా మరో సినిమా చర్చల దశలో ఉంది. ప్రస్తుతం కరుప్పు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీని సంక్రాంతి రేసులో దింపేందుకు మేకర్స్ మొదటి నుంచి ప్రయత్నాలు సాగిం చారని టాక్. అందుకోసమే స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నారని సమాచారం. కానీ సడెన్ గా ఈ మూవీ ఓటీటీ టర్న్ తీసుకుందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి డేట్ ను పరాశక్తి ఫైనల్ చేయడంతో.. ఈ మూవీ వెనక్కి దగ్గిందని తెలుస్తోంది. కావాలనే ఈ మూవీ తప్పుకుందా? ఎవరైనా తప్పించారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ విషయం తెలిసి సూర్య ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com