Actress Akshara Gauda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

Actress Akshara Gauda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
X

ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఫొటో షేర్ చేసి నవమాసాలు గడిచిన రోజులను గుర్తుచేసుకుంది. ‘తల్లి డ్యూటీ చేస్తూ ఎన్నో కోరికలను కోరుతూ 2024ను ముగిస్తున్నా. 9 నెలలు నా కడుపులో మోసి అచ్చం తనలాగే ఉండే ఒక బేబీని భర్తకు బెస్ట్ బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చా’ అని పోస్ట్ చేసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అక్షర గౌడ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బెంగళూరుకు చెందిన అక్షర గౌడ దర్శకుడు ఆకాశ్ బిక్కీని వివాహం చేసుకుంది. ఇక అక్షర సినిమాల విషయానికి వస్తే.. మొదట తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. తుపాకీ, ఆరంభం, భోగన్, మాయావన్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇక గత కొన్నేళ్లుగా వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. మన్మథుడు 2 , ది వారియర్, దాస్ కా ధమ్కీ, నేనేనా, హరోంహర సినిమాల్లో కనిపించింది అక్షర.

Tags

Next Story