Actress Sana Khan : రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

నటి సనా ఖాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘సరైన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అది జీవితంలో ఆనందాన్ని నింపుతుంది’ అని రాసుకొచ్చారు. 2020లో ఆమె ముస్లిం మతగురువు అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకోగా 2023లో ఓ బాబు జన్మించాడు. కాగా సనా ఖాన్ ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ ఒలకబోసింది. తన తొలి చిత్రం యే హై హై సొసైటీ అనే అడల్ట్ మూవీ. తర్వాత ఇ అనే తమిళ మూవీలో ఐటం సాంగ్ చేసింది. జర్నీ బాంబే టు గోవా మూవీలోనూ ఐటం సాంగ్ చేసింది. గోల్ సినిమాలో ఆమె చేసిన బిల్లో రాణి సెన్సేషన్ హిట్టయింది. ఈ సాంగ్‌తోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. సిలంబట్టం (తమిళ) చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
2020 నవంబర్‌లో సనా ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్ సయ్యద్‌ను నిఖా చేసుకుంది. సూరత్‌లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు 2023లో బాబు పుట్టాడు. అతడికి సయ్యద్ తరీఖ్ జమీల్ అని నామకరణం చేశారు. అయితే సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం మానుకోమని సనా ఆ మధ్య అభిమానులకు విజ్ఞప్తి చేసింది. తెలియక అలాంటి పాత్రలు చేశానని, దయచేసి ఆ ఫోటోలు ఎవరూ షేర్ చేయొద్దని, కుదిరితే సామాజిక మాధ్యమాల్లోంచి వాటిని డిలీట్ చేయాలని కోరడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com